IPL 2024 : హసరంగ స్థానంలో విజయకాంత్

by Harish |
IPL 2024 : హసరంగ స్థానంలో విజయకాంత్
X

దిశ, స్పోర్ట్స్ : గాయం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) స్పిన్ ఆల్‌రౌండర్, శ్రీలంకకు చెందిన వానిందు హసరంగ ఐపీఎల్-17కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్ మంగళవారం వెల్లడించింది. అలాగే, హసరంగ స్థానాన్ని భర్తీ చేసింది. శ్రీలంకకే చెందిన స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్‌ను జట్టులోకి తీసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ అతనితో రూ. 50 లక్షలకు ఒప్పందం చేసుకుంది. గతేడాది శ్రీలంక తరపున ఆఫ్ఘనిస్తాన్‌పై అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన విజయకాంత్ ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీశాడు. ఈ ఏడాది దుబాయ్ ఐఎల్‌టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను 4 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. అలాగే, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో చట్టోగ్రామ్ చాలెంజర్స్‌కు, లంక ప్రీమియర్ లీగ్ జఫ్నా కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్-2023 సీజన్‌లో విజయ్‌కాంత్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నెట్‌బౌలర్‌గా సేవలందించాడు.

Advertisement

Next Story