SRH కెప్టెన్‌ కమ్మిన్స్‌తో టాలీవుడ్ స్టార్ హీరో భేటీ

by GSrikanth |
SRH కెప్టెన్‌ కమ్మిన్స్‌తో టాలీవుడ్ స్టార్ హీరో భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: మనసుకు నచ్చిన ఇద్దరు వ్యక్తులను ఒకేచోట చూడటానికి రెండు కళ్లు సరిపోవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రిన్స్ మహేష్ బాబు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అలాగే ఈ ఐపీఎల్ సీజన్‌లో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్‌ పాట్ కమ్మిన్స్‌ను కూడా ఇష్టపడని వారు ఎవరు ఉండరు. వీరిద్దరు కలిసి ఒకేచోట సందడి చేస్తే ఇక ఫ్యాన్స్‌ను ఆపడం ఎవరి తరం కాదు. అయితే నిజంగానే వీరిద్దరు కలిశారు. కాకపోతే అది పబ్లిక్‌లో కాదు. ఓ యాడ్ షూట్‌లో భాగంగా పాట్ కమ్మిన్స్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిశారు.


ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఫొటోలను ఫోజులిచ్చారు. కాసేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని కమ్మిన్స్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ‘టాలీవుడ్ ప్రిన్స్‌తో ఈ మధ్యాహ్నం సరదాగా గడిపాం’ అని కమ్మిన్స్ పేర్కొన్నారు. దీంటో అటు హైదరాబాద్ టీమ్ ఫ్యాన్స్, ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్ తెగ సంబుర పడిపోతున్నారు. కాగా, క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని అనేకసార్లు మహేశ్ బాబు వెల్లడించిన విషయం తెలిసిందే. పలుమార్లు SRH కు సపోర్ట్ చేస్తూ ఉప్పల్ మైదానానికి కూడా వచ్చారు.


Advertisement

Next Story