IPL2024: చితక్కొట్టిన ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుట భారీ లక్ష్యం

by GSrikanth |
IPL2024: చితక్కొట్టిన ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుట భారీ లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి సత్తా చాటింది. ఆదివారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీపై 234 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్లు మొదటి నుంచి దూకుడు ప్రదర్శించింది. రోహిత్(49), ఇషాన్ కిషన్(42), హార్దిక్ పాండ్యా(39), టిమ్ డెవిడ్(45), షెఫార్డ్(39) ఇలా అందరూ సమిష్టిగా రాణించి భారీ స్కోరు నమోదు చేశారు. మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని ముంబై ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి బోణీ కొట్టాలని భావిస్తోంది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, నోర్జే చెరో రెండేసి వికెట్లు తీయగా, ఖలీల్ ఒక వికెట్ తీశారు.

Advertisement

Next Story