మలింగను వెనక్కినెట్టిన సునీల్ నరైన్.. ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు

by Harish |
మలింగను వెనక్కినెట్టిన సునీల్ నరైన్.. ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు
X

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డు సాధించాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అతను కేకేఆర్ తరపున 168 ఇన్నింగ్స్‌ల్లో 172 వికెట్లు తీశాడు. దీంతో ఐపీఎల్‌లో ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ నుంచి లసిత్ మలింగ(170 వికెట్లు)‌, జస్ప్రిత్ బుమ్రా(158, ముంబై ఇండియన్స్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 150 వికెట్లు, చెన్నయ్ తరపున బ్రావో 140 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Next Story