- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారిద్దరే నాకు రోల్ మోడల్ : లక్నో పేస్ సంచలనం యశ్ ఠాకూర్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ, దిగ్గజ పేసర్ ఉమేశ్ యాదవ్ తనకు రోల్ మోడల్ అని లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ యశ్ ఠాకూర్ తెలిపాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యశ్ తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఐదు వికెట్లతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడిన వీడియోను ఐపీఎల్ సోమవారం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో యశ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఉమేశ్ యాదవ్ నాకు ఆదర్శం. అతని వల్లే నేను ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. అతనికి ప్రత్యర్థిగా ఆడితే ఎక్కువగా నేర్చుకోవచ్చు. అతను చాలా నిరాండబరుడు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన అతను నాకు సహాయం చేస్తాడు.’ అని తెలిపాడు.
అలాగే, తాను ధోనీని కూడా ఆరాధిస్తానని యశ్ చెప్పాడు. ‘ధోనీ బ్యాటుతో ఎలాగైతే మ్యాచ్‌లను ముగిస్తాడో నేను బంతితో ఆ పని చేయాలనుకుంటున్నా. అ అతనికి గొప్ప గేమ్ సెన్స్ ఉంది.’ అని తెలిపాడు. అలాగే, యశ్ తన కుటుంబం గురించి మాట్లాడాడు. ‘ఈ ఐదు వికెట్ల ప్రదర్శనను నా తండ్రికి అంకితమిస్తాను. ఆయన చనిపోయారు. నన్ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడం అతని కల. ఆయన నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. మా నాన్న, నా కుటుంబం లేకుంటే నేను ఇక్కడే ఉండేవాడిని కాదు. ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు లేదా గాయపడినప్పుడు నా కుటుంబం నన్ను ప్రేరేపించేది.’ అని యశ్ చెప్పుకొచ్చాడు.