SRH VS GT: తడబడిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లు.. గుజరాత్ టైటన్స్ చేతిలో మరో ఓటమి

by Shiva |
SRH VS GT: తడబడిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లు.. గుజరాత్ టైటన్స్ చేతిలో మరో ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: హోం గ్రౌండ్‌ ఉప్పల్‌లో ముంబై జట్టుకు చుక్కలు చూపించిన ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్లు అహ్మదాబాద్‌లో తడబడ్డారు. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆరెంజ్ ఆర్మీ పరాజయం పాలైంది. అంతకు ముందు టాస్ గెలిచి ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తడబడకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో 34 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ (16; 17 బంతుల్లో, 2 ఫోర్లు) అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదరిగాడు.

అనంతరం ట్రావిస్ హెడ్ (19; 14 బంతుల్లో, 3 ఫోర్లు) పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ శర్మ (29; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లతో ధాటిగా ఆడినప్పటికీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. మిడిలార్డర్‌లో వచ్చిన క్లాసెన్ (24; 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), మార్క్‌రామ్ (19; 17 బంతుల్లో), షాబాజ్ అహ్మద్ (22; 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), అబ్దుల్ సమద్ (29; 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి అవుటయ్యారు. దీంతో ఎస్ఆర్‌హెచ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 162 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచింది.

అనంతరం బ్యాటింగ్ గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (25; 13 బంతుల్లో 1 ఫోర్, 23 సిక్స్‌లు), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (36; 28 బంతుల్లో 2 ఫోర్, 1 సిక్స్‌) పరుగులతో చక్కని ఆరంభాన్ని అదించారు. అయితే, స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ వృద్ధిమాన్ సాహాను, శుభ్‌మన్ గిల్‌ను మయాంక్ మార్కండేలు పెవిలియన్‌కు పంపారు. అనంతరం వచ్చిన సాయి సుదర్శన్ (36; 45 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌)తో ధాటిగా ఆడాడు. మరో ఎండ్‌లో డేవిడ్ మిల్లర్ (44; 27 బంతుల్లో 4 ఫోర్లు, 23 సిక్స్‌లు)‌ పరుగులు చేసి ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో గుజరాత్ టైటన్స్ జట్టు 19.1 ఓవర్లలో 168 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది.

Advertisement

Next Story

Most Viewed