- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2024 : చెలరేగిన డికాక్, పూరన్.. బెంగళూరు ముందు టఫ్ టార్గెట్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో భాగంగా బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు లక్నో సూపర్ జెయింట్స్ 182 పరుగుల టఫ్ టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్(20), స్టోయినిస్(24) స్వల్ప స్కోరుకే అవుటవ్వగా.. దేవదత్ పడిక్కల్(6) నిరాశపరిచాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా డికాక్ మాత్రం బెంగళూరు బౌలర్లపై విరుచుకపడ్డాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. ఇక, ఆఖర్లలో నికోలస్ పూరన్ మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. 21 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లతో మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్(20), స్టోయినిస్(24) స్వల్ప స్కోరుకే అవుటవ్వగా.. దేవదత్ పడిక్కల్(6), ఆయుష్ బడోని(0) నిరాశపరిచారు. బెంగళూరు బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు తీయగా.. రీస్ టోప్లే, యశ్ దయాల్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.