- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సొంతగడ్డపై బెంగళూరుకు మరో ఓటమి.. లక్నో సూపర్ విక్టరీ
దిశ, స్పో్ర్ట్స్ : ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. మొత్తంగా నాలుగు మ్యాచ్‌ల్లో మూడో పరాజయం. బెంగళూరు వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును 28 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఓడించింది. లక్నోకు వరుసగా ఇది రెండో విజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 181/5 స్కోరు చేసింది. డికాక్(81) కీలక ఇన్నింగ్స్‌తో రెచ్చిపోగా.. పూరన్(40 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలోబెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. మహిపాల్ లోమ్రోర్(33) టాప్ స్కోరర్. లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్(3/14) మరోసారి సత్తాచాటాడు.
బెంగళూరు తడబాటు
లక్ష్య ఛేదనలో బెంగళూరు ఏమాత్రం పోరాట పటిమ కనబర్చలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(22), డు ప్లెసిస్(19) ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించినా వారు క్రీజులో నిలువలేదు. కోహ్లీ వికెట్‌తో సిద్ధార్థ్ ఆర్సీబీ పతనాన్ని ప్రారంభించాడు. యువ పేసర్ మయాంక్ యాదవ్ తన పేస్‌తో బెంబేలెత్తించాడు. అతని బౌలింగ్‌లో డుప్లెసిస్ రనౌటవ్వగా..మ్యాక్స్‌వెల్(0)ను డకౌట్ చేశాడు. దీంతో బెంగళూరు పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి తడబడింది. కాసేపటికే గ్రీన్(9) నిరాశపర్చగా.. ఇన్నింగ్స్ నిర్మించేందుకు చూసిన రజత్ పటిదార్(29)ను కూడా మయాంకే అవుట్ చేశాడు. దీంతో బెంగళూరు 103/6 స్కోరుతో నిలువగా అందరూ ఓటమి ఖాయమే అని డిసైడ్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో మహిపాల్ లోమ్రోర్(33) మెరుపులతో జట్టులో ఆశలు చిగురించాయి. అయితే, దినేశ్ కార్తీక్(4) నిరాశపర్చడంతో అతనికి మద్దతు కరువైంది. కాసేపటికే యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన అతను పూరన్‌కు చిక్కడంతో ఆర్సీబీ ఆశలు చెల్లాచెదరయ్యాయి. ఇక, చివరి ఓవర్‌లో సిరాజ్(12) అవుటవడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగాను బెంగళూరు ఆట ముగిసింది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 వికెట్లతో సత్తాచాటాడు. నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు, సిద్ధార్థ్, యశ్ ఠాకూర్, స్టోయినిస్ చెరో వికెట్ తీశారు.
చెలరేగిన డికాక్.. ఆఖర్లో పూరన్ మెరుపులు
అంతకుముందు లక్నోకు ఓపెనర్ డికాక్ అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన అతను.. సిరాజ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు దంచాడు. అయితే, మరో ఎండ్‌లో వికెట్లు పడటంతో లక్నో కాస్త తడబడింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(20), స్టోయినిస్(24) ధాటిగా ఆడే క్రమంలో అవుటవ్వగా.. పడిక్కల్(6) నిరాశపరిచాడు. వికెట్లు పడుతున్నా ఏ మాత్రం లెక్కచేయని డికాక్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఈ క్రమంలోనే 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతను.. ఆ తర్వాతి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టాడు. దీంతో సెంచరీ దిశగా వెళ్తున్న డికాక్(81) దూకుడుకు టోప్లే బ్రేక్ వేశాడు. క్రీజులోకి వచ్చిన ఆయుశ్ బడోని(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక, చివరి రెండు ఓవర్లలో పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 19వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు, ఆఖరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టి 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు తీయగా.. టోప్లే, యశ్ దయాల్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
స్కోరుబోర్డు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 181/5(20 ఓవర్లు)
డికాక్(సి)మయాంక్ దగర్(బి)టోప్లే 81, రాహుల్(సి)మయాంక్ దగర్(బి)మ్యాక్స్‌వెల్ 20, పడిక్కల్(సి)అనుజ్ రావత్(బి)సిరాజ్ 6, స్టోయినిస్(సి)మయాంక్ దగర్(బి)మ్యాక్స్‌వెల్ 24, పూరన్ 40 నాటౌట్, ఆయుశ్ బడోని(సి)డుప్లెసిస్(బి)యశ్ దయాల్ 0, కృనాల్ పాండ్యా 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 10.
వికెట్ల పతనం : 53-1, 73-2, 129-3, 143-4, 148-5
బౌలింగ్ : రీస్ టోప్లే(4-0-39-1), యశ్ దయాల్(4-0-24-1), సిరాజ్(4-0-47-1), మ్యాక్స్‌వెల్(4-0-23-2), మయాంక్ దగర్(2-0-23-0), గ్రీన్(2-0-25-0)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 153 ఆలౌట్(19.4 ఓవర్లు)
కోహ్లీ(సి)పడిక్కల్(బి)సిద్ధార్థ్ 22, డు ప్లెసిస్ రనౌట్(పడిక్కల్) 19, రజత్ పటిదార్(సి)పడిక్కల్(బి)మయాంక్ యాదవ్ 29, మ్యాక్స్‌వెల్(సి)పూరన్(బి)మయాంక్ యాదవ్ 0, గ్రీన్(బి)మయాంక్ యాదవ్ 9, అనుజ్ రావత్(సి)పడిక్కల్(బి)స్టోయినిస్ 11, మహిపాల్ లోమ్రోర్(సి)పూరన్(బి)యశ్ ఠాకూర్ 33, దినేశ్ కార్తీక్(సి)రాహుల్(బి)నవీన్ ఉల్ హక్ 4, మయాంక్ దగర్ రనౌట్(పూరన్) 0, టోప్లే 3 నాటౌట్, సిరాజ్(సి)పూరన్(బి)నవీన్ ఉల్ హక్ 12; ఎక్స్‌ట్రాలు 11.
వికెట్ల పతనం : 40-1, 42-2, 43-3, 58-4, 94-5, 103-6, 136-7, 137-8, 138-9, 153-10
బౌలింగ్ : సిద్ధార్థ్(3-0-21-1), కృనాల్(1-0-10-0), నవీన్ ఉల్ హక్(3.4-0-25-2), మయాంక్ యాదవ్(4-0-14-3), రవి బిష్ణోయ్(3-0-33-0), యశ్ ఠాకూర్(4-0-38-1), స్టోయినిస్(1-0-9-1)