ఆర్సీబీ ఆ పని చేస్తే మంచిది.. మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్

by Harish |
ఆర్సీబీ ఆ పని చేస్తే మంచిది.. మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్ల కంటే ఆ జట్టు బ్యాటర్ విరాట్ కోహ్లీ బౌలింగ్ బాగా వేస్తాడని భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు దారుణంగా తేలిపోవడంపై శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ..‘రీస్ టోప్లీ, లూకీ ఫెర్గూసన్ రాణించడం లేదు. విల్ జాక్స్ వారి అత్యుత్తమ బౌలర్. 11 మంది బ్యాటర్లతోనే ఆడటం బెటర్. డు ప్లెసిస్ 2 ఓవర్లు, గ్రీన్ 4 ఓవర్లు, కోహ్లీ 4 ఓవర్లు వేయాలి. విరాట్ మంచి బౌలరే. స్టేడియం వెలుపలికి వెళ్తున్న బంతులను చూస్తున్న విరాట్‌ను చూస్తుంటే నాకు చాలా బాధేసింది.’ అని తెలిపాడు. కాగా, బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు నాకౌట్ రౌండ్‌కు చేరుకోవాలంటే అద్భుతమే జరగాలి. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించడంతోపాటు మిగతా జట్ల ఫలితాలపైనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఈ నెల 21న కోల్‌కతాను ఆ జట్టు ఎదుర్కోనుంది.

Advertisement

Next Story