అతడి కంటే రాహుల్ చాలా మంచి బ్యాటర్ : వీరేంద్ర సెహ్వాగ్

by Vinod kumar |
అతడి కంటే రాహుల్ చాలా మంచి బ్యాటర్ : వీరేంద్ర సెహ్వాగ్
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా నేడు రాజస్థాన్, లక్నో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ రెండు జట్ల కెప్టెన్ల గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇరు జట్ల కెప్లెన్స్‌ సంజూ శాంసన్, కేఎల్ రాహుల్‌లో ఎవరు బెటర్ అనే చర్చపై సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సంజూ శాంసన్ కంటే రాహుల్ చాలా మంచి బ్యాటర్ అని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

"ఇండియన్ టీమ్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంపై మాట్లాడితే మాత్రం సంజూ శాంసన్ కంటే కేఎల్ రాహుల్ చాలా బెటర్. అతడు టెస్టు క్రికెట్ ఆడాడు. చాలా దేశాల్లో సెంచరీలు చేశాడు. వన్డేల్లోనూ ఓపెనర్‌గా, మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణించాడు. టీ20ల్లోనూ మంచి స్కోర్లు సాధించాడు" అని సెహ్వాగ్ అన్నాడు. దీంతోపాటు ఈ ఐపీఎల్లో అతడు తిరిగి ఫామ్‌‌లోకి వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశాడు. కేఎల్ రాహుల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. గత మ్యాచ్‌లో అతడు రన్స్ చేశాడని తెలిపాడు.

Advertisement

Next Story