- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నితీశ్‌లో స్పెషల్ టాలెంట్.. తెలుగు కుర్రాడిపై షేన్ వాట్సన్ ప్రశంసలు
దిశ, స్పోర్ట్స్ : తెలుగు కుర్రాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ నితీశ్ రెడ్డి రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో సత్తాచాటిన విషయం తెలిసిందే. 42 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో నితీశ్ రెడ్డిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. అతనిలో ప్రత్యేకమైన టాలెంట్ ఉందన్నాడు. ‘నితీశ్ కచ్చితంగా నా ఫేవరెట్ క్రికెటర్లలో ఒకడు. స్పిన్ బౌలింగ్‌లో అతని ఆధిపత్యం ఆకట్టుకుంది. ముఖ్యంగా చాహల్, అశ్విన్ బౌలింగ్‌లో అతను కొన్ని అరుదైన నాణ్యమైన షాట్లు ఆడాడు. చిన్న వయసులోనే నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం, వాటిని వరల్డ్ బెస్ట్ బౌలర్లపై, అందులోనూ ఒత్తిడిలో అమలు చేశాడు. అతనిలో స్పెషల్ టాలెంట్ ఉంది. ఐపీఎల్ ద్వారా ఈ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన ప్రతిభ గల భారత యువ క్రికెటర్లలో నితీశ్ ఒక్కడు.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 154.22 స్ట్రైక్‌రేటుతో 219 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.