శ్రేయస్ అయ్యర్‌కు ఆ అర్హత ఉంది : కేకేఆర్ హెడ్ కోచ్

by Harish |
శ్రేయస్ అయ్యర్‌కు ఆ అర్హత ఉంది : కేకేఆర్ హెడ్ కోచ్
X

దిశ, స్పోర్ట్స్ : దాదాపు రెండు నెలలు సందడి చేసిన ఐపీఎల్-17 ముగిసింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) టైటిల్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రేయస్ అయ్యర్‌పై కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిల్ ప్రశంసలు కురిపించాడు. టీమ్ ఇండియాకు కెప్టెన్ అయ్యే అర్హత అయ్యర్‌కు ఉందని చెప్పాడు. ‘కోల్‌కతా విజేతగా నిలవడంలో అయ్యర్‌ క్రెడిట్ చాలా ఉంది. అతనో అద్భుతమైన కెప్టెన్. చాలా ప్రశాంతంగా ఉంటాడు. అయ్యర్ మా సూచనలు తీసుకుంటాడు. మైదానంలో, వెలుపుల అతను జట్టును చక్కగా హ్యాండిల్ చేశాడు. భవిష్యత్తులో భారత కెప్టెన్సీకి అర్హుడయ్యే లక్షణాలను చూపించాడు.’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, అయ్యర్ కెప్టెన్‌గానేకాకుండా ప్లేయర్‌గానూ సత్తాచాటాడు. 15 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత కోల్‌కతా ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఆ జట్టుకు ఇది మూడో టైటిల్. గతంలో 2012, 2014 సీజన్లలో విజేతగా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed