డేవిడ్ వార్నర్ బూట్లపై భార్య, కుమార్తెల పేర్లు.. ఫోటో వైరల్

by Mahesh |
డేవిడ్ వార్నర్ బూట్లపై భార్య, కుమార్తెల పేర్లు.. ఫోటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కెప్టెన్ డేవిడ్ వార్నర్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్ లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఢిల్లీ కెప్టెన్ పంత్ యాక్సిడెంట్ తర్వాత ఢిల్లీ కెప్టెన్ గా భాద్యతలు తీసుకున్న వార్నర్ ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో విరోచితంగా పోరాడాడు. కాగా ఈ మ్యాచ్‌లో వార్నర్ వేసుకున్న బూట్లపై సర్వత్ర చర్చ కొనసాగుతుంది. వార్నర్ మొదటి మ్యాచ్ సందర్భంగా అతని షూస్‌పై భార్య, అతని ముగ్గురు కుమార్తెల పేర్లను ప్రింట్ చేపించాడు. ఇది గమనించిన కెమెరామెన్ ఫోటో తీశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వార్నర్ కు తన కుటుంభం మీద ఉన్న ప్రేమను ఇలా నిరూపించుకున్నాడని కొందరు అభిప్రాయపడగా.. మరికొందరు షూపై వేసుకొవడం ఎంటని విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story