MS ధోని పోస్ట్ వైరల్.. ఈ సీజన్‌ నుంచి తప్పుకోబోతున్నారా?

by GSrikanth |
MS ధోని పోస్ట్ వైరల్.. ఈ సీజన్‌ నుంచి తప్పుకోబోతున్నారా?
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2024 సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22 నుంచే ఈ ధనాధన్ లీగ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఎమ్ఎస్ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై, విరాట్ కోహ్లీ కీలకంగా వ్యవహరిస్తున్న బెంగళూరు జట్ల మధ్య జరుగనుంది. అయితే, సీజన్ ప్రారంభం వేళ చెన్నై ఫ్యాన్స్‌ను ధోని కలవరపాటుకు గురిచేశారు. సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. దీంతో అటు చెన్నై ఫ్యాన్స్, ఇటు ధోని ఫ్యాన్స్‌లో టెన్షన్ పెరిగిపోయింది.

అసలు ఆ పోస్టులో ఏం పెట్టారంటే.. ‘‘కొత్త సీజన్, కొత్త పాత్ర’’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దీని గురించి అతి త్వరలోనే అప్‌డేట్ ఇస్తా అని పేర్కొన్నారు. దీంతో ధోని పేర్కొన్న ఆ కొత్త పాత్ర ఏంటనే దానిపై నెట్టింట చర్చ మొదలైంది. కెప్టెన్సీ నుంచి తప్పుకొని కోచ్ లేదా మెంటర్ అవతారం ఎత్తబోతున్నారా? అని కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. లేదా యాడ్‌కు సంబంధించి ఈ పోస్టు పెట్టారా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఐపీఎల్ సీజన్ ప్రారంభం వేళ ఫ్యాన్స్‌లో ధోని కొత్త టెన్షన్ పెట్టారు.

Advertisement

Next Story