ధోనీ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో ఆ రికార్డు నెలకొల్పిన తొలి వికెట్ కీపర్ అతనే

by Harish |
ధోనీ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో ఆ రికార్డు నెలకొల్పిన తొలి వికెట్ కీపర్ అతనే
X

దిశ, స్పోర్ట్స్ :చెన్నయ్ సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎం.ఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్‌గా ఘనత సాధించాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో జితేశ్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంతో ధోనీ ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో అతను మొత్తం 150 క్యాచ్‌లు 42 స్టంపింగ్స్ చేశాడు. లీగ్‌లో అత్యధిక క్యాచ్‌లు, స్టింపింగ్స్ చేసిన వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. ధోనీ తర్వాతి స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఉన్నాడు. దినేశ్ కార్తీక్ 144 క్యాచ్‌లు, 36 స్టంపింగ్స్ చేశాడు. వృద్ధిమాన్ సాహా (141 క్యాచ్‌లు, 36 స్టంపింగ్స్), రిషబ్ పంత్ (75 క్యాచ్‌లు, 21 స్టంపింగ్స్), రాబిన్ ఉతప్ప (58 క్యాచ్‌లు, 33 స్టంపింగ్స్) టాప్-5లో ఉన్నారు.

Advertisement

Next Story