MI Vs DC: తొలి విజయం కోసం ఢిల్లీతో ముంబై అమీతుమీ.. పాయింట్ల పట్టికలో బోణీ కొట్టేనా!

by Shiva |
MI Vs DC: తొలి విజయం కోసం ఢిల్లీతో ముంబై అమీతుమీ.. పాయింట్ల పట్టికలో బోణీ కొట్టేనా!
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస పరాజయాలతో కుదేలైన ముంబై జట్టు తొలి విజయం కోసం అష్టకష్టాలు పడుతోంది. ఈ మేరకు ఇవాళ ఆ జట్టు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో తలపడుతోంది. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబై మూడింట్లోనూ పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో జట్టుతో టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ చేరడంతో కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది. అదే జోరులో గెలుపు బాట పట్టాలని ముంబై భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించింది.

కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 106 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. గత మ్యాచ్ పొరపాట్లను సరిద్దికుని ఈ మ్యాచ్‌లో సత్తాచాటాలని కసిగా ఢిల్లీ బరిలోకి దిగుతుంది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనబడుతోంది. మరోవైపు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, రిషభ్ పంత్ లాంటి బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ముంబై, ఢిల్లీ జట్టును మట్టికరిపిస్తోందా.. లేక చతికిలపడుతుందో వేచి చూడాల్సిందే.

ముంబై జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వి.కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, రోమారియో షెఫర్డ్, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోట్జీ, జస్ప్రీత్ బుమ్రా.

ఢిల్లీ జట్టు: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, రిషభ్ పంత్(వి.కీపర్, కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జాయ్ రిచర్డ్‌సన్, అన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

Advertisement

Next Story