RCBపై లక్నో సూపర్ విజయం..

by Mahesh |
RCBపై లక్నో సూపర్ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా.. జరిగినన 15వ మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠ బరితంగా సాగింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు కీలక ఆటగాళ్ల వికెట్లు కోల్పోయినప్పటికీ స్టోయినిస్ 65, పూరన్ 62 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరితో పాటు యువ బ్యాటర్ ఆయుష్ బడోని 30 పరుగులు కీలకంగా మారాయి. కానీ ఆయుష్ బడోని సెల్ఫ్ అవుట్ కావడంతో లక్నో ఓటమి అంచుల్లోకి వెళ్లింది.

చివరి 6 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన సమయంలో 19.2 వుడ్, 19.5 బంతులకు ఉనద్కత్ అవుట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఎట్టకేలకు చివరి బంతికి సింగిల్ తీయడంతో లక్నో జట్టు 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ పై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కదా నిజమైన ఐపీఎల్ త్రిల్లింగ్ మ్యాచ్ అని RCB vs LSG మ్యాచ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Advertisement

Next Story