బట్లర్ బాదేశాడు.. ఆఖరి బంతికి రాజస్థాన్ విజయం

by Harish |
బట్లర్ బాదేశాడు.. ఆఖరి బంతికి రాజస్థాన్ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : బట్లర్ అదరగొట్టాడు. సంచలన ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ రాయల్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. కోల్‌కతా వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 2 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 223/6 స్కోరు చేసింది. సునీల్ నరైన్(109, 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకంతో రెచ్చిపోవడంతో కేకేఆర్‌కు భారీ స్కోరే దక్కింది. అయితే, 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది. జోస్ బట్లర్(107 నాటౌట్, 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసామాన పోరాటం చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరోవైపు, ఈ సీజన్‌లో రెండో ఓటమిని చవచూసిన కోల్‌కతా రెండో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

Next Story