- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాల్ట్ మెరుపులు.. లక్నోపై కోల్‌కతా సూపర్ విక్టరీ
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో చెన్నయ్ చేతిలో ఓటమితో వెనుకబడ్డ కోల్‌కతా నైట్‌రైడర్స్ తిరిగి పుంజుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి మళ్లీ గెలుపు బాటపట్టింది. ఆదివారం కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నోపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 161/7 స్కోరు చేసింది. పూరన్(45)టాప్ స్కోరర్. కెప్టెన్ రాహుల్(39) విలువైన పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్(3/28) సత్తాచాటాడు. అనంతరం 162 లక్ష్యాన్ని కోల్‌కతా అలవోకగా ఛేదించింది. 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం అందుకుంది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(89 నాటౌట్) మెరుపులతో కోల్‌కతా గెలుపు సునాయాసమైంది. అతనికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(38 నాటౌట్) సహకరించాడు. పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా 2వ స్థానంలో కొనసాగుతుండగా.. వరుసగా రెండో ఓటమితో లక్నో ఒక్క స్థానాన్ని కోల్పోయి 5వ స్థానానికి పడిపోయింది.