IPL2024: టాస్ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. జట్టు ఇదే..

by GSrikanth |
IPL2024: టాస్ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. జట్టు ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చండీగఢ్‌లోని అంతర్జాతీయ మైదానం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడగా.. రెండు గెలిచి, రెండింట్లో ఓడిపోయాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఇరు జట్లు తహతహలాడుతున్నాయి.

హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, మయాంక్ అగర్వాల్/నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమ్మిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, T. నటరాజన్, మయాంక్ మార్కండే

పంజాబ్ టీమ్: శిఖర్ ధావన్ (C), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (wk), శశాంక్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్/సికందర్ రజా, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ

Advertisement

Next Story