బోణి కొట్టిన హైదరాబాద్ జట్టు..

by Mahesh |
బోణి కొట్టిన హైదరాబాద్ జట్టు..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వేదికగా SRHvsPBKS మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు ఓటముల తర్వాత మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. హైదరాబాద్ బౌలర్లు పటిష్టంగా బౌలింగ్ వేయడం, మార్కండే.. ఊహించని దెబ్బ కొట్టడంతో వందలోపే 9 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే ఓపెనర్ గా వచ్చిన ధావన్ నెమ్మదిగా ఆడుతూ చివరి ఓవర్లో తన బ్యాట్ జులిపించారు. ధావన్ 66 బంతులు ఆడి 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 99* చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో పంజాబ్ స్కోరు.. నిర్ణీత 20 ఓవర్లకు 143 కు చేరుకుంది. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు పవర్ ప్లేలో నెమ్మదిగా మొదలు పెట్టారు. రాహుల్ త్రిపాఠి 74, కెప్టెన్ మార్క్రమ్ 31, మయాంక్ 21, తో రాణించడంతో హైదరాబాద్ జట్టు 17 బంతులు మిగిలి ఉండగానే.. 8 వికెట్ల భారీ విజయాన్ని అందుకుంది.

Advertisement

Next Story