IPL-2024: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎమ్ఎస్ ధోని

by GSrikanth |
IPL-2024: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎమ్ఎస్ ధోని
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2024) ప్రారంభం వేళ అభిమానులకు ఎమ్ఎస్ ధోని షాకిచ్చారు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఆయన స్థానంలో యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇచ్చారు. తెల్లవారితే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ధోని తీసుకున్న నిర్ణయం అటు ఫ్రాంచైజీని, ఇటు అభిమానులకు ఖంగుతినేలా చేసింది. వచ్చే సీజన్‌లో ఉంటాడో లేడో తెలియదని.. అందుకే గైక్వాడ్ సిద్ధం చేస్తున్నాడని ఐపీఎల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, IPL-2024 సీజన్-17 శుక్రవారం(మార్చి 22) నుంచి ప్రారంభమవుతుంది. చెన్నై వేదికగా జరగనున్న ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌ సీఎస్‌కేతో తలపడనుంది.

Advertisement

Next Story