మహీ భాయ్ నుంచి అదే నేర్చుకున్నా : శివమ్ దూబె

by Harish |
మహీ భాయ్ నుంచి అదే నేర్చుకున్నా : శివమ్ దూబె
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17ను డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్‌ విజయంతో ఆరంభించింది. ఓపెనింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన శివమ్ దూబె 28 బంతుల్లో 34 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం గేమ్ ఫినిషింగ్ నైపుణ్యాలపై దూబె మాట్లాడుతూ.. మ్యాచ్‌ను ఎలా ముగించాలనేది ధోనీ నుంచి నేర్చుకున్నానని చెప్పాడు. ‘చెన్నయ్ తరపున ఆట ముగించడం చాలా స్పెషల్. అందులోనూ ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో, బెంగుళూరుపై గేమ్ ముగించడం చాలా బాగుంది. మహీ భాయ్ నుంచి ఇది నేర్చుకున్నా. ప్రతి మ్యాచ్‌లోనూ మ్యాచ్‌ను ముగించడానికే ప్రయత్నిస్తా.’ అని దూబె తెలిపాడు. ఈ నెల 26న చెన్నయ్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

Advertisement

Next Story