- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: మరో ఆసక్తికర పోరు.. నేడు కోల్‌కతాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్ స్టేడియంలో కేకేఆర్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టబోతున్నది.రెండు వరుస ఓటముల తర్వాత తొలి విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్‌తో గత మ్యాచ్‌లో సమష్టిగా రాణించి అద్భుత విజయాన్నందుకున్న సన్‌రైజర్స్.. అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. మరోవైపు సంచలన ప్రదర్శనతో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌లను మట్టికరిపించిన కేకేఆర్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. మరో థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులను కనువిందు చేయనుంది.
ఈడెన్ గార్డెన్ పిచ్ కండిషన్స్ ఆధారంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కాంబినేషన్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. కేకేఆర్‌తో ఓ ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. ఆదిల్ రషీద్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రూ.13.25 కోట్ల ఆటగాడు హరీ బ్రూక్ తీవ్రంగా నిరాశ పరుస్తుండటంతో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ అతన్ని తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలున్నాయి. కోల్‌కతా పిచ్.. స్పిన్‌కు అనుకూలంగా ఉండడం.. హరీ బ్రూక్‌కు టర్నింగ్ ట్రాక్స్‌పై మంచి రికార్డు లేని నేపథ్యంలో అతన్ని పక్కన పెట్టడమే మంచిదని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు(అంచనా):
రహ్మానుల్లా గుర్బాజ్ (wk), నారాయణ్ జగదీశన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా):
హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (c), హెన్రిచ్ క్లాసెన్ (WK), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, T నటరాజన్
ఇవి కూడా చదవండి:
IPL 2023: 56 డాట్ బాల్స్ ఆడితే.. ఓడిపోక గెలుస్తామా..? : పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్