IPL 2023: ఐపీఎల్‌ హిస్టరీలో శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు..

by Vinod kumar |
IPL 2023: ఐపీఎల్‌ హిస్టరీలో శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు..
X

దిశ, వెబ్‌డెస్క్: వరుసగా రెండోసారి ఛాంపియన్స్‌గా నిలవాలన్న గుజరాత్‌ టైటాన్స్‌ కలనెరవలేదు. ధోని సారధ్యంలోని సీస్‌ఎస్‌కే ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. గుజరాత్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆరెంజ్‌ క్యాప్‌ను క్యాప్‌ నెగ్గిన అతి పిన్న వయస్కుడిగా గిల్‌ (23 ఏళ్ల 263 రోజులు) రికార్డులెక్కాడు. గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ పేరిట ఉంది. 2021 సీజన్‌లో గైక్వాడ్‌ 24 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించాడు.

Advertisement

Next Story