IPL 2023: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీమ్‌తో కలిసిన కీలక ప్లేయర్!

by Vinod kumar |
IPL 2023: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీమ్‌తో కలిసిన కీలక ప్లేయర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కీలక ప్లేయర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు వానిందు హసరంగ జట్టుతో చేరాడు. ఇప్పటి వరకు ఆర్సీబీ స్పిన్ బాధ్యతలను కర్ణ్ శర్మ పోషించాడు. ఇప్పుడు వానిందు హసరంగ జట్టుతో చేరడంతో ఆర్సీబీకి బలమైన స్పిన్ ఎటాక్ దొరికినట్లు అయింది. హసరంగ చేరికతో ఆర్సీబీ బౌలింగ్ మరింత బలంగా మారింది. చిన్నస్వామి స్టేడియంలోనే త్వరలో ఢిల్లీతో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హసరంగ ఆడతాడని తెలుస్తోంది. అతను కనుక గాడిలో పడితే ఆర్సీబీ బౌలింగ్ బలం కచ్చితంగా రెట్టింపు అవుతుంది. అలాగే ఈ ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తమ గ్రీన్ జెర్సీలో ఆడనుందని తెలుస్తోంది.

Next Story