IPL 2023: అదరగొట్టిన పంజాబ్‌ బ్యాటర్స్.. కేకేఆర్‌ టార్గెట్‌ ఇదే

by Vinod kumar |
IPL 2023: అదరగొట్టిన పంజాబ్‌ బ్యాటర్స్.. కేకేఆర్‌ టార్గెట్‌ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్‌ బ్యాటర్లలో శిఖర్‌ ధావన్‌(57) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో షారుక్ ఖాన్( 8 బంతుల్లో 21 పరుగులు), హర్‌ప్రీత్‌ బ్రార్‌ ( 9 బంతుల్లో 17) పరుగులతో రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 3 వికెట్లు తీయగా.. హర్షిత్‌ రాణా రెండు, సుయాష్‌ శర్మ, నితీష్‌ రాణా తలా ఒక్క వికెట్‌ సాధించారు.

Advertisement

Next Story