IPL 2023: నేడు రాజస్తాన్‌తో గుజరాత్ ఢీ..

by Vinod kumar |   ( Updated:2023-05-04 18:46:24.0  )
IPL 2023: నేడు రాజస్తాన్‌తో గుజరాత్ ఢీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నది. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉన్న గుజరాత్‌తో.. టేబుల్‌లో 4వ స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ ఢీ కొట్టబోతున్నది. గుజరాత్ 9 మ్యాచ్‌లో 6 గెలిచి.. 12 పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉంది. రాజస్తాన్ 9 మ్యాచ్‌లో 5 గెలిచి.. 4వ స్థానంలో కొనసాగుతున్నది. రాజస్తాన్ రాయల్స్‌కి ప్లేఆఫ్‌లో నిలవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ కీలకం కానుంది.

రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు (అంచనా):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (c&wk), షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు (అంచనా):

వృద్ధిమాన్ సాహా (వికె), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (సి), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్

Advertisement

Next Story