IPL 2023: నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాజస్తాన్ ఢీ..

by Vinod kumar |   ( Updated:2023-05-10 18:45:34.0  )
IPL 2023: నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాజస్తాన్ ఢీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. పాయింట్స్ టేబుల్‌లో వరుసగా 5, 6 స్థానాల్లో ఉన్న రాజస్తాన్, కేకేఆర్ జట్ల మధ్య ఆసక్తికర ఫైట్ జరగనుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో లాస్ట్ బాల్‌కి థ్రిలింగ్ విక్టరీ సాధించిన కేకేఆర్.. ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్‌లో అడుగుపెట్టాలనకుంటుంది. మరోవైపు సన్‌రైజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను సన్‌రైజర్స్ ఓడించింది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. బంతి అందుకున్న సందీప్ శర్మ ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. చివరి బంతికి నోబాల్ వేసి ఆ జట్టు కొంప ముంచాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుదిజట్టు (అంచనా):

రహ్మానుల్లా గుర్బాజ్ (wk), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి

రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు (అంచనా):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c & wk), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్

Advertisement

Next Story