IPL 2023: LSG భారీ విక్టరీ..

by Mahesh |
IPL 2023: LSG భారీ విక్టరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 నాలుగో మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య లక్నో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యా్చ్‌లో మొదట టాస్ ఓడిన లక్నో బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టిదెబ్బ తగిలింది. మార్క్ వుడ్ నాలుగు ఓవర్లకు 5 వికెట్లు తీశాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసి.. 50 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

Advertisement

Next Story