IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్ల క్రికెట్ కిట్స్‌ చోరీ..

by Vinod kumar |
IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్ల క్రికెట్ కిట్స్‌ చోరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పేలవ ప్రదర్శనతో.. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ ఓటమిపాలైంది. ఢిల్లీ జట్టు తదుపరి మ్యాచ్‌లో ఏ‍ప్రిల్‌ 20న అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో తలపడనుంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తాజాగా మరో చేదు అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఢిల్లీ ఆటగాళ్ల క్రికెట్ కిట్‌లు చోరీకి గురయ్యాయి. ఆటగాళ్ల బ్యాట్లు, ప్యాడ్స్, థై ప్యాడ్స్, షూస్, గ్లోవ్స్ ఇతర విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి.

కేకేఆర్‌తో మ్యాచ్‌ కోసం వార్నర్‌ సేన బెంగళూరు నుంచి నేరుగా ఆదివారం(ఏప్రిల్‌16) ఢిల్లీకు చేరుకోగా.. తమ కిట్లు కనిపించకుండా పోయినట్లు ఆటగాళ్లు గుర్తించారు. చోరికి గురైన వస్తువులలో 16 బ్యాట్‌లు, బూట్లు, ప్యాడ్‌లు, గ్లోవ్‌లు ఉన్నాయి. అయితే ఇందులో 3 బ్యాట్‌లు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు సంబంధించినవి కాగా.. 2 మిచెల్‌ మార్ష్‌, మూడు ఫిల్ సాల్ట్, 5 బ్యాట్లు యష్ ధుల్‌కి చెందినవి. దీనిపై ఫ్రాంఛైజీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Next Story