IPL 2023: నేడు బిగ్ ఫైట్.. రాజస్థాన్‌పై చెన్నయ్ రివేంజ్ తీసుకుంటుందా..?

by Vinod kumar |   ( Updated:2023-04-26 18:45:59.0  )
IPL 2023: నేడు బిగ్ ఫైట్.. రాజస్థాన్‌పై చెన్నయ్ రివేంజ్ తీసుకుంటుందా..?
X

జైపూర్: ఐపీఎల్-16 లీగ్ దశలో చెన్నయ్ సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మరోసారి తలపడబోతున్నాయి. నేడు జైపూర్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో చెన్నయ్‌కు షాకిస్తూ రాజస్థాన్ విజయఢంకా మోగించింది. అయితే, ఆరంభంతో పోలిస్తే చెన్నయ్ మరింత బలంగా మారింది. వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. మరోవైపు, రాజస్థాన్ వరుస ఓటములతో కాస్త వెనకబడింది. నేటి మ్యాచ్‌లో ఓటమికి చెన్నయ్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. మళ్లీ గెలుపు బాట పట్టాలని రాజస్థాన్ అనుకుంటున్నది. చెన్నయ్ బ్యాటింగ్ దళంలో రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, రహానే, శివమ్ దూబే కీలక పాత్ర పోషిస్తున్నారు.


ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, జడేజా, మథీష పథిరానా, మహేశ్ తీక్షణ వంటి బౌలర్లతో సీఎస్కే బౌలింగ్ దళం కూడా పటిష్టంగా ఉంది. మరోవైపు, రాజస్థాన్‌ భారీ హిట్టింగ్ లైనప్‌ను కలిగి ఉన్నది. యశస్వి జైశ్వాల్, బట్లర్, పడిక్కల్, సంజూ శాంసన్, హిట్మేయర్, ధ్రువ్ జురెల్ వరకు రాణించేవారు ఉండటం రాజస్థాన్ బలం. అలాగే, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ, బౌల్ట్, హోల్డర్, ఆడమ్ జంపాలతో బౌలింగ్ లైనప్ కూడా బాగుంది. మొత్తంగా నేడు జరగబోయే సమవుజ్జీల మ్యాచ్‌లో పైచేయి సాధించేదెవరో వేచచూడాల్సిందే.

Advertisement

Next Story