- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: బోణీ కొట్టని జట్ల మధ్య బిగ్ ఫైట్.. నేడు ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
న్యూఢిల్లీ: ఐపీఎల్-16లో బోణీ కొట్టని జట్లు ఏవైనా ఉన్నాయంటే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే. ముంబై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోగా.. ఢిల్లీ మూడుకు మూడింట పరాజయం పాలైంది. లీగ్ ఖాతా తెరించేందుకు ఎదురుచూస్తున్న ఈ రెండు జట్లు నేడు జరిగే మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. లీగ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టైనా ముంబై ఇండియన్స్.. గత రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ముంబై అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పటికైనా ఆ జట్టు పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీపై విజయం సాధించాలని రోహిత్ సేన భావిస్తున్నది. కెప్టెన్ రోహిత్, ఇషాన్ కిషన్, గ్రీన్, సూర్యకుమార్ విఫలమవడం ముంబైకి తీవ్ర నష్టం కలిగిస్తున్నది. టాపార్డర్ వీలైనంత త్వరగా ఫామ్ అందుకునే ముంబై గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఒక్కటే జట్టులో కాస్త నిలకడగా రాణిస్తున్నాడు. అతనికితోడుగా మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌లో మరో బ్యాటర్ లేకపోవడం ముంబైకి నష్టం కలిగించేదే. బౌలింగ్‌లోనూ ముంబై మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది.
గాయం కారణంగా చెన్నయ్‌తో మ్యాచ్‌కు జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. నేటి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటంపై సందిగ్ధం నెలకొంది. పేస్ దళంలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ సైతం బోణీ కోసం నానా తంటాలు పడుతున్నది. జట్టులో కెప్టెన్ వార్నర్ మినహా మరోబ్యాటర్ క్రీజులో నిలువడమే కష్టమైపోయింది. ఓపెనర్ పృథ్వీషా ఇప్పటికైనా ఫామ్ అందుకోకపోతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉన్నది.
అలాగే, మనీష్ పాండే, రోసోవ్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, పొవెల్, అభిషేక్ పొరెల్ పుంజుకుంటేనే ఢిల్లీ మెరుగైనా ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది. బౌలింగ్ విషయంలో ఖలీల్, నోర్జే, ముఖేశ్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లతో బలంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా ఢిల్లీ జట్టు బ్యాటింగ్ పరంగానే మెరుగువ్వాల్సిన అవసరం ఉన్నది.