పంత్.. సహజసిద్ధమైన కెప్టెన్ : గంగూలీ

by Harish |
పంత్.. సహజసిద్ధమైన కెప్టెన్ : గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌‌లో సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆ జట్టు క్రికెట్ ఆఫ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. తాజాగా జియో సినిమాతో గంగూలీ మాట్లాడుతూ.. పంత్ సహజసిద్ధమైన కెప్టెన్ అని కొనియాడాడు. ‘పంత్ యువ సారథి. కాలంతోపాటు నేర్చుకుంటాడు. రోడ్డు ప్రమాదం తర్వాత అతను తిరిగి వచ్చిన విధానం చూస్తే మాకు కొన్ని అనుమానాలు ఉండే. కానీ, అతను సీజన్ మొత్తం బాగా ఆడటం నాకు ఆనందంగా ఉంది. మొదటి రోజే ఎవరూ గొప్ప కెప్టెన్ కాలేరు. పంత్ సహజసిద్ధమైన సారథి. మైదానంలో అతను నిర్ణయాలు తీసుకోగలడు. అతను ఉత్తమ నాయకుడిగా ఎదుగుతాడు.’ అని చెప్పాడు. కాగా, ఐపీఎల్-17లో ఢిల్లీ జట్టు మంగళవారం లక్నోతో చివరి లీగ్ దశ మ్యాచ్ ఆడేసింది. ఆ మ్యాచ్‌లో నెగ్గిన ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్నప్పటికీ.. మిగతా జట్ల ఫలితాలపైనే ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ 14 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed