- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: ఐపీఎల్‌కు గాయాల దెబ్బ..
న్యూఢిల్లీ: ఐపీఎల్-16 సీజన్‌ను మొదటి నుంచి గాయాలు వేధిస్తున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే పలువురు స్టార్లు గాయాలతో లీగ్‌కు దూరమయ్యారు. రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, బెయిర్ స్టో, కైల్ జేమీసన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేశ్ చౌదరి వంటి క్రికెటర్లు ఆ జాబితాలో ఉన్నారు. లీగ్ ప్రారంభం తర్వాత కూడా గాయాల సమస్య ఐపీఎల్‌ను వెంటాడుతున్నది. చెన్నయ్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయపడి లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో చెన్నయ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బాదిన బంతిని బౌండరీ వద్ద అందుకోబోయి జారిపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను లీగ్ నుంచి నిష్ర్కమించాడు.
అతని స్థానంలో గుజరాత్ ఫ్రాంచైజీ.. శ్రీలంకకు చెందిన దాసున్ శనకను జట్టులోకి తీసుకుంది. కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. లీగ్ సెకండాఫ్‌లో ఐపీఎల్‌లో పాల్గొంటాడని వార్తలు వచ్చాయి. అయితే, అతను సర్జరీ కోసం విదేశాలకు వెళ్లనుండటంతో లీగ్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. ఈ సీజన్‌లో కేకేఆర్‌ను నితీశ్ రాణా నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అయ్యర్ స్థానంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా ఏ ఆటగాడిని భర్తీ చేయలేదు.
అలాగే, బెంగళూరు యువ సంచలనం రజత్ పటిదార్ మడమ గాయంతో లీగ్ నుంచి నిష్ర్కమించాడు. గత సీజన్‌లో సత్తాచాటిన ఈ యువ క్రికెటర్‌పై ఈ సారి ఆర్సీబీ అంచనాలు పెట్టుకుంది. అయితే, అతను ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ సారి లీగ్‌లో గాయాల కారణంగా బెంగళూరు జట్టు భారీగా నష్టపోయింది. లీగ్ ప్రారంభానికి ముందే విల్ జాక్స్ దూరం కాగా.. గాయపడిన పేసర్ జోష్ హాజెల్‌వుడ్ పాల్గొనడంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అలాగే, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా రీస్ టాప్లే భుజం స్థానభ్రంశం చెందింది. పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ఆటగాడు రాజ్‌అగద్ బవా భుజానికి గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు.
టీమ్ మేనేజ్‌మెంట్ అతని స్థానంలో గుర్నూర్ సింగ్ బ్రార్‌ను తీసుకుంది. అదే జట్టుకు చెందిన స్టార్ బ్యాటర్ భానుక రాజపక్స రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ధావన్ ఆడిన బంతి నేరుగా నాన్‌స్ట్రైక్‌లో ఉన్న రాజపక్సకు బలంగా తాకడంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉండటంతో అతను లీగ్‌లో కొనసాగడంపై సందేహాలు ఉన్నాయి. ఆట మలుపు తిప్పే స్టార్ క్రికెటర్లు గాయాల కారణంగా లీగ్ నుంచి నిష్ర్కమిస్తుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ డిస్సాపాయింట్ అవుతున్నారు.