వరుస ఓటములపై పాండ్యా రియాక్షన్ ఇదే

by Harish |
వరుస ఓటములపై పాండ్యా రియాక్షన్ ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నది. సీజన్‌లో ఇంకా బోణీ కొట్టని ఏకైక జట్టు ముంబైనే. సోమవారం రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో ఆ జట్టు హ్యాట్రిక్ పరాజయాన్ని చూవిచూసింది. వరుస ఓటముల నేపథ్యంలో జట్టులో, అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశాడు కెప్టెన్ పాండ్యా. ఎక్స్‌ వేదికగా మంగళవారం ఓ పోస్టు చేశాడు. ముంబై జట్టు ఫొటోను షేర్ చేసిన అతను.. ‘ఈ జట్టు గురించి ఏదైనా మీకు తెలుసుకోవాలనుకుంటే.. మేము ఎప్పటికీ వెనక్కి తగ్గం. మేము పోరాడుతూనే ఉంటాం. ముందుకు వెళ్తూనే ఉంటాం.’ అని రాసుకొచ్చాడు. కాగా, ముంబై జట్టు తదుపరి మ్యాచ్‌లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మరి, ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి బోణీ కొడుతుందో లేదో చూడాలి.

Advertisement

Next Story