- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2024 : తడబడిన హైదరాబాద్.. గుజరాత్ ముందు మోస్తరు లక్ష్యం
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. సొంతగడ్డపై మెరుపులు మెరిపించిన హైదరాబాద్ బ్యాటర్లు అహ్మదాబాద్‌లో తడబడ్డారు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో క్రీజులో నిలువలేకపోయారు. ఏ ఒక్కరూ 30 పరుగులు చేయలేకపోయారు. 29 పరుగులు చేసిన అభిషేశ్ శర్మ, అబ్దుల్ సమద్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. వారికితోడు క్లాసెన్(24), షాబాజ్ అహ్మద్(22) విలువైన పరుగులు జోడించడంతో హైదరాబాద్ కష్టంగా పోరాడే స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లతో హైదరాబాద్‌ను కట్టడి చేశాడు. అజ్మతుల్లా, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.