అతడిని ఢిల్లీ కెప్టెన్‌గా తప్పించడమే బెటర్.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్

by Vinod kumar |
అతడిని ఢిల్లీ కెప్టెన్‌గా తప్పించడమే బెటర్.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్-2023 సీజన్‌లో ఢిల్లీ 8 మ్యాచ్‌లు ఆడితే ఆరు మ్యాచ్‌లలో ఓడింది. బ్యాటింగ్ వైఫల్యాలు ఆ జట్టును దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వరుసగా ఐదు మ్యాచ్‌ల ఓటమి తర్వత రెండు మ్యాచ్‌లు గెలిచి టచ్‌లోకి వచ్చినట్టే కనిపించిన ఢిల్లీ.. మళ్లీ శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓడింది. దీంతో దీనిపై వార్నర్‌పై హర్భజన్ సింఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వార్నర్ కెప్టెన్‌గా విఫలమవుతున్నాడని, అతడిని తప్పించి అక్షర్ పటేల్‌ను సారథిగా నియమించాలని అభిప్రాయపడ్డాడు. వార్నర్ జట్టును నడిపించడంలో విఫలమవుతున్నాడని, బ్యాటర్‌గా రాణిస్తున్నా కెప్టెన్‌గా మాత్రం అతడు సక్సెస్ కావడం లేదని వాపోయాడు. అక్షర్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణిస్తున్నాడని.. అక్షర్‌లో కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పాడు. ఇక 8 మ్యాచ్‌లలో రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ.. మే 2న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

Advertisement

Next Story