రెయిన్‌ బో జెర్సీలో ఢిల్లీ ప్లేయర్స్

by Javid Pasha |
రెయిన్‌ బో జెర్సీలో ఢిల్లీ ప్లేయర్స్
X

న్యూఢిల్లీ : ఐపీఎల్-16లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఘోర ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు చేరుకుండా ఇంటిదారి పట్టనుంది. ఈ క్రమంలో నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌‌ను ఢిల్లీ జట్టు ఆదివారం చెన్నయ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్లు స్పెషల్ జెర్సీ ధరించనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ జట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటివరకు ఢిల్లీ ప్లేయర్స్ రెడ్, బ్లూ కలర్ జెర్సీలో కనిపించారు. చెన్నయ్‌తో చివరి మ్యాచ్‌లో రెయిన్ బో జెర్సీని ధరించబోతున్నారు. అయితే, స్పెషల్ జెర్సీ ధరించడానికి గల కారణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా వెల్లడించలేదు. స్వలింగ సంపర్కులకు రెయిన్ బో కలర్ చిహ్నంగా ఉంది.

వారికి మద్దతుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి మ్యాచ్‌లో ఈ జెర్సీని వేసుకోనుందని తెలుస్తోంది. గతేడాది కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఢిల్లీ ఆటగాళ్లు రెయిన్ బో జెర్సీలో కనిపించారు. అలాగే, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు సైతం నేడు కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో కొత్త జెర్సీని ధరించనున్నారు. ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ ఏటికే మోహన్ బగాన్ ఆటగాళ్లు వేసుకునే జెర్సీ(మెరూన్, గ్రీన్ కలర్)ని వేసుకోనున్నారు. ఫుట్‌బాల్ క్లబ్ మోహన్ బగాన్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు సంజీవ్ గొయెంకానే ఓనర్ కావడం గమనార్హం.

Advertisement

Next Story