కోహ్లీ సరసన వార్నర్.. ఏ విషయంలో తెలుసా?

by Hamsa |
కోహ్లీ సరసన వార్నర్.. ఏ విషయంలో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఐపీఎల్ లో 6000 రన్స్ చేసిన మూడో ఆటగాడిగా వార్నర్ రికార్డ్ సృష్టించాడు. అంతకు ముందు ఈ ఫీట్ ను కోహ్లీ, ధావన్ అందుకున్నారు. ఇక తక్కువ మ్యాచుల్లో ఈ ఫీట్ ను అందుకున్న బ్యాటర్ గా వార్నర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. 188 మ్యాచుల్లో కింగ్ కోహ్లీ 6 వేల రన్స్ క్లబ్ లో చేరగా.. ధావన్ 199 మ్యాచుల్లో 6వేల మైల్ స్టోన్ ను అందుకున్నాడు. కానీ వార్నర్ మాత్రం 165 మ్యాచుల్లోనే 6వేల రన్స్ చేసి ఫాస్టెస్ట్ రన్స్ స్కోరర్ గా నిలిచాడు.

అంతకు ముందు 5,974 పరుగులు చేసిన వార్నర్.. శనివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 26 పరుగులు సాధించడం ద్వారా 6 వేల రన్స్ క్లబ్ లో చేరాడు. కాగా.. 2009లో ఢిల్లీ టీమ్ తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా 2016లో కప్ అందించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు వార్నర్ కెప్టెన్ గా ఉన్నాడు. కాగా 6వేల రన్స్ క్లబ్ లో చేరిన సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం వార్నర్ అభినందిస్తూ ట్విట్లర్ లో పోస్టు పెట్టింది.

Advertisement

Next Story