- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2024 : చితక్కొట్టిన చెన్నయ్ బ్యాటర్లు.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో చెన్నయ్ సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయంపై కన్నేసింది. సొంతగడ్డపై మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగారు. దీంతో గుజరాత్ ముందు చెన్నయ్ 207 పరుగుల భారీ లక్ష్యం పెట్టింది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నయ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. మొదట ఓపెనర్లు రచిన్ రవీంద్ర(46), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(46) జట్టుకు శుభారంభం అందించారు. బౌండరీలతో విరుచుకపడిన వీరు తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అయితే, వీరిద్దరూ తృటిలో హాఫ్ సెంచరీలను చేజార్చుకున్నారు. అజింక్యా రహానే(12), డారిల్ మిచెల్(24) స్వల్ప స్కోరుకే అవుటైనా.. శివమ్ దూబె(51) మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. దూబె చెలరేగడంతో చెన్నయ్‌కు భారీ స్కోరు దక్కింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. సాయి కిశోర్, జాన్సన్, మోహిత్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.