ఉప్పల్‌లో IPL మ్యాచ్.. స్టేడియానికి ఆ వస్తువులు తీసుకెళ్తే తిరిగి ఇంటికే..!

by Satheesh |
ఉప్పల్‌లో IPL మ్యాచ్.. స్టేడియానికి ఆ వస్తువులు తీసుకెళ్తే తిరిగి ఇంటికే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హో గ్రౌండ్‌లో మరికొన్ని గంటల్లో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన ఎస్ఆర్‌హెచ్.. హోమ్ గ్రౌండ్‌లో బుధవారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబై-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ తరుణ్ జోషి స్టేడియానికి వెళ్లేవారికి కీలక సూచన చేశారు. స్టేడియం లోపలికి ఎలాంటి వస్తువులు తీసుకురావొద్దని సూచించారు. ల్యాప్ టాప్, నీళ్లు, సీసాలు, బ్యానర్లు, లైటర్లు, సిగరెట్లు స్టేడియంలోకి తీసుకురావడం నిషేదమని తెలిపారు.

నిషేదిత వస్తులను తీసుకువచ్చిన వారిని స్టేడియంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. ఇక, మ్యాచ్ ప్రారంభానికి 3 గంటల ముందు నుండే స్టేడియంలోకి అనుమతిస్తామని చెప్పారు. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం, పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మ్యాచ్ కోసం 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. స్టేడియం వద్ద మ్యాచ్ ముగిసే వరకు నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed