- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్.. అఫ్గాన్ పేసర్ వచ్చేస్తున్నాడు
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్. ఆ జట్టు పేసర్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఫజల్‌హక్ ఫరూఖీ జట్టులో చేరబోతున్నాడు. ఈ సీజన్‌లో అతను ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) అనుమతి ఇవ్వకపోవడంతో అతను హైదరాబాద్ ఆడిన 7 మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
తాజాగా ఏసీబీ నో అబ్జెక్షషన్ సర్టిఫికేట్ మంజూరు చేయడంతో అతను ఐపీఎల్‌లో పాల్గొనబోతున్నాడు. ఇండియాకు బయల్దేరినట్టు ఫరూఖీ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. 2022లో హైదరాబాద్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతను.. మొత్తం 7 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో బెంగళూరుతో హైదరాబాద్ తలపడనుంది. తుది జట్టులో ఫరూఖీకి చోటు దక్కుతుందో లేదో చూడాలి.
Advertisement
Next Story