IPL కంటే నాకు వరల్డ్ కప్ ఎక్కువ ముఖ్యం.. ఆస్ట్రేలియా ప్లేయర్ ప్రకటన

by GSrikanth |
IPL కంటే నాకు వరల్డ్ కప్ ఎక్కువ ముఖ్యం.. ఆస్ట్రేలియా ప్లేయర్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-14వ సీజన్‌ హాట్ హాట్‌గా నడుస్తోంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగుతూ ప్రేక్షలకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త ప్లేయర్లు తమ టాలెంట్‌ను పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్‌పై ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ జాంపా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ నుంచి వైదొలగడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఐపీఎల్ కంటే తనకు దేశం తరపున ఆడబోయే టీ20 ప్రపంచకప్ ముఖ్యమని అన్నారు. టీ20 ప్రపంచ కప్ కోసం మానసికంగా, ఫిట్‌నెస్ పరంగా సన్నద్ధమయ్యేందుకే ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా జట్టులో స్థానం కోసం చూస్తున్నానని.. ఈ కీలకమైన 9 వారాలు ఐపీఎల్ కోసం వెచ్చించలేనని చెప్పాడు. కాగా, 2023లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఆడమ్ జాంపా సీజన్‌ మొత్తంలో కేవలం 8 వికెట్లే తీసి ఘోరంగా విఫలం అయ్యాడు.




Advertisement

Next Story