ఎట్టకేలకు ముంబై బోణీ

by Harish |
ఎట్టకేలకు ముంబై బోణీ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన ఆ జట్టు.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపు ఖాతా తెరిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. రోహిత్(49), ఇషాన్ కిషన్(42) జట్టుకు శుభారంభం అందించగా.. టిమ్ డేవిడ్(45 నాటౌట్), రొమారియో షెఫర్డ్(39 నాటౌట్) చివరి ఓవర్లలో మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తాచాటారు. అనంతరం 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. ట్రిస్టన్ స్టబ్స్(71 నాటౌట్) చివరి వరకు అద్భుతమైన పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఓపెనర్ పృథ్వీ షా(66) హాఫ్ సెంచరీతో మెరవగా.. అభిషేక్ పొరెల్(41) రాణించాడు. ఈ సీజన్‌లో ఢిల్లీకి వరుసగా ఇది రెండో ఓటమి. మొత్తంగా నాలుగో పరాజయం.

Advertisement

Next Story