టీ20 వరల్డ్ కప్: న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియం కూల్చివేత

by Mahesh |
టీ20 వరల్డ్ కప్: న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియం కూల్చివేత
X

దిశ, వెబ్ డెస్క్: 2024 టీ20 వరల్డ్ కప్ కు అమెరికా, వెస్టిండీస్ జట్లు ఆతిధ్యం అందించాయి. ఈ క్రమంలో అమెరికా దేశం ప్రత్యేకంగా ఈ టీ20 ప్రపంచ కప్ కోసం భారీ బడ్జెట్‌తో గ్రౌండ్ లను నిర్మించారు. ఇందులో భాగంగా న్యూయార్క్ లోని నసావు క్రికెట్ స్టేడియంను కూడా దాదాపు 250 కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ మైదానంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. అలాగే మరి కొన్ని మ్యాచులు కూడా జరిగాయి. కానీ ఒక్కమ్యాచులో కూడా భారీ స్కోర్ రాకపోవడంతో స్టేడియంపై ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో వరల్డ్ కప్ మ్యాచ్ ల షెడ్యూల్ ముగియగానే న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియాన్ని భారీ యంత్రాలతో తొలగించారు. అయితే దీని నిర్మాణం చేసేటప్పుడు.. పూర్తిగా ఏ పార్టుకు ఆ పార్టు తొలగించే విధంగా నిర్మించారు. దీంతో ఆ గ్రౌండ్ ను పూర్తిగా ఎక్కడిక్కడ తొలగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed