- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T20 World Cup : టీమ్ ఇండియాకు భారీ ప్రైజ్‌మనీ.. ఎంతో తెలుసా?
దిశ, స్పోర్ట్స్ : ఈ సారి టీ20 వరల్డ్ కప్ ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచిన విషయం తెలిసిందే. విజేతగా నిలిచిన భారత్ రూ. 20.42 కోట్లు(2.45 మిలియన్ డాలర్లు) ప్రైజ్‌మనీ అందుకుంది. గత ఎడిషన్ నగదు బహుమతితో పోలిస్తే రూ. 7 కోట్లు ఎక్కువ. రన్నరప్ సౌతాఫ్రికా రూ. 10.67 కోట్లు పొందింది. సెమీస్‌లో వెనుదిరిగిన ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్ జట్లకు చెరో రూ. 6.56 కోట్లు దక్కనున్నాయి.
సూపర్-8 చేరిన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, అమెరికా జట్లకు తలో రూ.3.18 కోట్లు ప్రైజ్‌మనీని ఐసీసీ ఇవ్వనుంది. గ్రూపు దశకే పరిమితమై 9 నుంచి 12 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 2.06 కోట్ల చొప్పున, 13 నుంచి 20 స్థానాల్లో నిలిచిన జట్లకు తలో రూ. 1.87 కోట్లు దక్కనున్నాయి. అలాగే, ఫైనల్స్, సెమీస్ మినహా మిగతా మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లకు ఐసీసీ అదనంగా రూ. 26 లక్షల చొప్పున క్యాష్ రివార్డ్ ఇవ్వనుంది.