జైషా శపదం.. జండా పాతి చూపించిన రోహిత్

by Mahesh |
జైషా శపదం.. జండా పాతి చూపించిన రోహిత్
X

దిశ, వెబ్ డెస్క్: గతంలో రోహిత్ శర్మపై వరుసగా వచ్చిన విమర్శలకు చెక్ పెడుతూ.. జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 టీ20 వరల్డ్ కప్ లో బార్బొడాస్ లో రోహిత్ శర్మ ఆధ్వర్యంలో కప్ గెలిచి జెండా పాతుతం అని శపథం చేశారు. ఆయన అన్నట్టుగానే నిన్నటి మ్యాచ్ విజయం అనంతరం రోహిత్ శర్మ, బీసీసీఐ సెక్రటరీ జైషా బార్బొడాస్ మైదానంలో భారతీయ జెండా‌ని పాతారు. దీంతో నాడు షా ఇచ్చిన మాటను రోహిత్ నిలబెట్టాడని.. మీరు చాలా గ్రేట్ సార్ అంటూ షా వీడియోను, నిన్నటి మ్యాచ్ అనంతరం జెండా పాతిన వీడియో ని కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచులో విజయం అనంతరం రోహిత్, విరాట్, పాండ్యా కన్నీరు పెట్టుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన కోహ్లీ ప్రజెంటేషన్ సమయంలోనే టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన కల నెరవేరిందని.. ఇంతటితో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలపగా.. ఆదివారం మధ్యాహ్నం ఆల్ రౌండర్ జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా ఈ వరల్డ్ కప్ హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కు చివరి మ్యాచ్ గా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed