- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్.. టీ20 వరల్డ్ కప్ జట్టులో సంజూ శాంసన్, కేఎల్ రాహుల్‌కు నో చాన్స్
దిశ, స్పోర్ట్స్: జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులో జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు మాజీ ఆటగాళ్లు తమ అంచనాలతో కూడిన జట్లను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన జట్టును బుధవారం వెల్లడించాడు. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోకపోవడం గమనార్హం. కీపర్‌గా రిషబ్ పంత్‌ను మాత్రమే ఎంపిక చేసిన ఇర్ఫాన్.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీలను తీసుకున్నాడు. వీరిలో ఎవరైనా ఇద్దరితో ఓపెనింగ్ చేయించాలని సూచించాడు. శుభమన్ గిల్‌ను రిజర్వులో ఉంచాడు. మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్, పంత్, రింకూ సింగ్, శివమ్ దూబేను తీసుకోగా, పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా హార్దిక్ పాండ్యా, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా జడేజాను ఎంపిక చేశాడు. స్పిన్ బౌలింగ్‌లో చాహల్, కుల్దీప్ యాదవ్‌ను తీసుకోగా, పేసర్లలో బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్‌కు చోటిచ్చాడు. స్పిన్నర్లలో రవిబిష్ణోయ్, వరుణ్ చక్రవర్తితోపాటు పేసర్లలో నటరాజన్, మయాంక్ యాదవ్, ఖలీల్ అహ్మద్‌లను పక్కనపెట్టడం గమనార్హం.
ఇర్ఫాన్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టు ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(కీపర్), జడేజా, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్