రోహిత్ శర్మ సంచలనం నిర్ణయం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్

by Harish |
రోహిత్ శర్మ సంచలనం నిర్ణయం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. టీ20 ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని పేర్కొన్నాడు. ‘ఇదే నా చివరి టీ20 మ్యాచ్. టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడానికి ఇంత కంటే మంచి సమయం ఉండదు. టీ20లతోనే నా కెరీర్ మొదలైంది. కప్ గెలవాలని బలంగా కోరుకున్నాను. అది మాటల్లో చెప్పలేను. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ఈ టైటిల్ కోసం చాలా తపన పడ్డాను. టైటిల్ గెలిచినందుకు సంతోషంగా ఉంది.’ అని చెప్పాడు. రోహిత్ నిర్ణయంతో భారత టీ20 కెప్టెన్‌‌గా కూడా తప్పుకున్నటైంది. అతని సారథ్యంలో భారత్ 62 మ్యాచ్‌ల్లో 49 విజయాలు సాధించింది. రోహిత్ 2007లో ఇంగ్లాండ్‌పై టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. భారత్ తరపున 159 మ్యాచ్‌ల్లో 4231 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed